హైదరాబాద్: వృద్ధాప్యంలో కన్నవారిని భారంగా భావించి రోడ్డున పడేసే బిడ్డలకు తెలంగాణ ప్రభుత్వం గట్టి హెచ్చరిక జారీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర కేబినెట్ ‘తల్లిదండ్రుల మద్దతు బిల్లు’ కు చారిత్రక ఆమోదం తెలిపింది.
చట్టం ఏం చెబుతోంది? కన్నవారిని నిర్లక్ష్యం చేసే ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఉద్యోగుల వేతనాల నుంచి 10 శాతం లేదా గరిష్టంగా రూ. 10,000 మొత్తాన్ని కోత విధించి, ఆ మొత్తాన్ని నేరుగా వారి తల్లిదండ్రుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసేలా ఈ చట్టాన్ని రూపొందించారు.
వి.సి. సజ్జనార్ గారి స్పందన: ఈ నిర్ణయంపై హైదరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ గారు స్పందిస్తూ.. ఇది సమాజంలో ఉన్న వేదనను దూరం చేసే గొప్ప నిర్ణయమని అభినందించారు.
మనా కార్పొరేటర్ విశ్లేషణ: కన్నవారిని కాపాడుకోవడం ధర్మం. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ మానవీయ నిర్ణయాన్ని మనా కార్పొరేటర్ 24/7 మనస్ఫూర్తిగా స్వాగతిస్తోంది.
సత్యమేవ జయతే.