Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

Yadagiri Sunil Rao

Karimnagar mayor, Corporator. Yadagiri Sunil Rao,

Yadagiri Sunil Rao Personal Profile

NameYadagiri Sunil Rao
Corporationkarimnagar
Division33
Year2020
PartyTRS
Date of birth – Age52yrs
ParentsRajeswar Rao
QualificationSSC
ProfessionBusiness
ReservedUR(G)
Caste/CategoryOC, Velama
Familywife-Aparna, Kids-Swapnika, Pradyum
AddressH.No. 9-1-193/1/11, Bhagath nagar,
Karimnagar – 505201.
Phone No.88866 96833

మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిల్ల శ్రీపాదరావు గారి 87వ జయంతి వేడుకలను పురస్కరించుకొని కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో శ్రీపాదరావు చిత్రపటానికి నగర మేయర్ వై.సునీల్ రావు గారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే బస్టాండ్ సర్కిల్ లోని ఆయన విగ్రహానికి పూలమాలలు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, మున్సిపల్ కమిషనర్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

కరీంనగర్ నగర అభివృద్ధిలో భాగంగా 21వ డివిజన్ లో ఎస్.డబ్ల్యూ.జి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు కార్పోరేటర్ జంగిలి సాగర్ గారితో కలిసి నగర మేయర్ యాదగిరి సునీల్ రావు గారు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, డివిజన్ వాసులు పాల్గొన్నారు.

కరీంనగర్ నగరపాలక సంస్థలో ఘనంగా పారిశుధ్య కార్మీకుడు (నైట్ వాచిమెన్) ఇల్లందుల మల్లయ్య పదవి విరమణ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర మేయర్ యాదగిరి సునీల్ రావు హాజరై కార్మీకుడిని శాలువాతో సత్కరించి పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందులో కార్పొరేటర్లు, నాయకులు సరిల్ల ప్రసాద్, గంట శ్రీనివాస్, మున్సిపల్ ఉద్యోగులు పాల్గొన్నారు.

సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని కరీంనగర్ సప్తగిరికాలనీ లోని సంత్ శ్రీ సేవాలాల్ మందిర స్థలంలో నిర్వహించిన ఉత్సవాలకు నగర మేయర్ వై.సునీల్ రావుతో కలిసి మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హాజరుయ్యారు. ముందుగా బంజారాలు నిర్వహించిన హోమం కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఉత్సవాలను ప్రారంభించారు.

తెలంగాణ గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో కరీంనగర్ ఎల్ఎండి దేవుళ్ళపురి లోని శ్రీ గంగామాత ఆలయంలో నిర్వహించిన శ్రీ గంగా పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం, బోనాలు వేడుకల్లో నగర మేయర్ వై.సునీల్ రావు గారు హాజరయ్యారు.

కరీంనగర్ లోని కిసాన్ నగర్ నూతనంగా ఏర్పాటు చేసిన ఆరోగ్య ఆయుర్వేద కేరళ పంచకర్మ వైద్యశాలను నగర మేయర్ యాదగిరి సునీల్ రావు ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు డాక్టర్ కె. అమర్నాథ్, కార్పొరేటర్లు ఎడ్ల సరిత- అశోక్, కంసాల శ్రీనివాస్, కుర్ర తిరుపతి, సరిల్ల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

కరీంనగర్ లోని ఇంద్రనగర్ లో జరిగిన అగ్ని ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు, నగర మేయర్ వై.సునీల్ రావు గారు..

నగరంలోని సివిల్ హాస్పిటర్ పహారి గోడను ఆనుకొని నగరపాలక సంస్థ ద్వారా నిర్మాణం చేసిన షాపులను గత 30 సంవత్సరాలుగా అక్కడ వ్యాపారం చేసుకునే వారికే కేటాయించాలని మేయర్ వై.సునీల్ రావు గారికి వినతి పత్రం అందజేసిన అసోసియేషన్ సభ్యులు.

ప్రస్తుతం షాపులు నిర్మాణం చేసిన చోట గతంలో ఎవరైతే అక్కడ ఉండి వ్యాపారం చేస్తున్నారో వారికే మొదటి ప్రాధాన్యత ఇస్తామని హామి ఇచ్చిన మేయర్ సునీల్ రావు గారు.