Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

Tag: BJP

పేద పిల్లలకు ఉచిత నోట్ పుస్తకాల పంపిణీ…

దీన్ దయాల్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పేద పిల్లలకు ఉచిత నోట్ పుస్తకాల పంపిణీ చేయడం జరిగింది. ఈ పుస్తకాలను వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు రామచందర్ సమకూర్చగా ముఖ్యఅతిథిగా మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రీ ఊరవల్లి శ్రవణ్ గారు పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మనకు దాతలు అందిస్తున్నటువంటి ఈ నోట్ పుస్తకాలను తీసుకొని మంచిగా చదువుకొని మనకున్నటువంటి పరిమిత వనరులను సద్వినియోగం చేసుకొని జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగాలని వారు ఈ సందర్భంగా కోరారు.

*గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన స్థానిక కార్పొరేటర్ శ్రీమతి క్యానం రాజ్యలక్ష్మీ గారు*

మల్కాజిగిరి నియోజకవర్గం వినాయక్ నగర్ 137 డివిజన్ పరిధిలోని బండ చెరువు వద్ద జరిగే గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన స్థానిక కార్పొరేటర్ శ్రీమతి క్యానం రాజ్యలక్ష్మీ గారు

ఈ సందర్భంగా వినాయక్ నగర్ మరియు ఇతర కాలనీల్లో పర్యటించి వినాయక ఉత్సవాలను పురస్కరించుకుని స్థానికులకు ఇబ్బంది కలగకుండా రోడ్డు మరమ్మతు పనులను చెయించాలని ఆదికారులకు సూచించడం జరిగింది.

కార్యక్రమంలో ae దీపక్, ఎంటోమొలజీ స్టాఫ్ పాల్గొన్నారు.