Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

Month: August 2022

*గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన స్థానిక కార్పొరేటర్ శ్రీమతి క్యానం రాజ్యలక్ష్మీ గారు*

మల్కాజిగిరి నియోజకవర్గం వినాయక్ నగర్ 137 డివిజన్ పరిధిలోని బండ చెరువు వద్ద జరిగే గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన స్థానిక కార్పొరేటర్ శ్రీమతి క్యానం రాజ్యలక్ష్మీ గారు

ఈ సందర్భంగా వినాయక్ నగర్ మరియు ఇతర కాలనీల్లో పర్యటించి వినాయక ఉత్సవాలను పురస్కరించుకుని స్థానికులకు ఇబ్బంది కలగకుండా రోడ్డు మరమ్మతు పనులను చెయించాలని ఆదికారులకు సూచించడం జరిగింది.

కార్యక్రమంలో ae దీపక్, ఎంటోమొలజీ స్టాఫ్ పాల్గొన్నారు.

ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారుచేసిన విగ్రహాలతో చెరువులు, కుంటలు, కలుషితమవుతాయని వాటిని కాపాడుకునేందుకు మట్టి వినాయకులనే పూజిద్దాం.

ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారుచేసిన విగ్రహాలతో చెరువులు, కుంటలు, కలుషితమవుతాయని వాటిని కాపాడుకునేందుకు
మట్టి వినాయకులనే పూజిద్దాం ప్రకృతి మాతను రక్షిస్తూ పర్యావరణ అనుకూలమైన గణేష్ చతుర్థి వేడుకలు
జరుపుకోవాలని చిన్నారుల మనసుల్లో సృజనాత్మకతను నింపి, దాని ప్రాముఖ్యతను బోధించిన
మేయర్ గద్వాల్ విజయలక్ష్మి.

Vijay Kumar Goud Amberpet Division Corporator.

మేయర్ గద్వాల విజయలక్ష్మి గారి అధ్యక్షతన నిర్వహించిన జిహెచ్ఎంసి సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యులు అంబర్పేట కార్పొరేటర్ ఈ విజయ్ కుమార్ గౌడ్ గారు , ఈ సందర్భంగా సమావేశంలో మాట్లాడిన కార్పొరేటర్ అంబర్ పేట లో ముస్లింలకు కేటాయించిన గ్రేవీ యాడ్ నిర్మాణం కొరకు వెంటనే నిధులు మంజూరు చేయవలసిందిగా కోరడంతో, 1 కోటి 10 లక్షల రూపాయలు మంజూరు చేస్తూ సర్వసభ్య సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది, ఇందుకు గాను కార్పొరేటర్ గౌరవ అంబర్పేట్ ఎమ్మెల్యే శ్రీ కాలేరు వెంకటేష్ గారికి, గౌరవ మంత్రివర్యులు శ్రీ కేటీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నారు.