Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

E Vijay Kumar Goud

అంబర్ పేట డివిజన్ దుర్గ నగర్ లో సుమారుగా 60 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా వేయనున్న సీసీ రోడ్డు పనులు,మరియు డ్రైనేజ్ పనులకు అంబర్ పేట నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ కాలేరు వెంకటేష్ గారు, అంబర్ పేట కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్ గారితో కలిసి శంకుస్థాపన చేశారు.

నూతన సీసీ రోడ్డు,మరియు సివరేజి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గారు, అంబర్ పేట డివిజన్ దుర్గ నగర్ లో సుమారుగా 60 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా వేయనున్న సీసీ రోడ్డు పనులు,మరియు డ్రైనేజ్ పనులకు అంబర్ పేట నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ కాలేరు వెంకటేష్ గారు, అంబర్ పేట కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్ గారితో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే గారు దుర్గ నగర్ లో పాదయాత్ర నిర్వహించి స్థానికంగా ఏమన్నా సమస్యలు ఉంటే తమ దృష్టికి తేవాలని ఎటువంటి సమస్యలు ఉన్న పరిశీలించి పరిష్కరిస్తామని తెలియజేశారు, అలాగే డ్రైనేజ్ మరియు సిసి రోడ్డు పనులను స్థానిక ప్రజలకు ఏటు వంటి ఇబ్బంది కలగకుండా త్వరిత గతిన పూర్తి చేయ్యాలని, పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత సిబ్బంది వర్క్ ఇన్స్పెక్టర్ దుర్గ,రమేష్,SFA భాస్కర్, ప్రణయ్,బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జాఫర్, సీనియర్ నాయకులు,కార్యకర్తలు, మహిళా నాయకులు,స్థానిక బస్తీ ప్రజలు,తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

అంబర్పేట్ కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్

75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అంబర్పేట్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ కాలేరు వెంకటేష్ అన్న గారితో కలిసి పాల్గొన్న అంబర్పేట్ కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్ గారు

75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అంబర్పేట్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ కాలేరు వెంకటేష్ అన్న గారితో కలిసి పాల్గొన్న అంబర్పేట్ కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్ గారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు పటేల్ నగర్ చౌరస్తాలో అలీ కేఫ్ లో మువ్వన్నెల జెండాని ఎగురవేయడం జరిగింది, అనంతరం కార్పొరేటర్ అంబర్ పేట డివిజన్ లోని బాపునగర్ న్యూ పటేల్ నగర్,పటేల్ నగర్, నరేంద్ర నగర్,ప్రేమ్ నగర్,న్యూ ప్రేమ్ నగర్,దుర్గ నగర్, మువ్వన్నెల జెండాను ఎగురవేసరు, కార్పొరేటర్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన స్వాతంత్ర సమరయోధులను స్మరించుకోవాలని, యువత వారి ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని, భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు సిద్ధార్థ ముదిరాజ్,ప్రధాన కార్యదర్శి జాఫర్, పార్టీ సీనియర్ నాయకులు,మహిళా నాయకులు మైనార్టీ నాయకులు పార్టీ అనుబంధ సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Vijay Kumar Goud Amberpet Division Corporator.

మేయర్ గద్వాల విజయలక్ష్మి గారి అధ్యక్షతన నిర్వహించిన జిహెచ్ఎంసి సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యులు అంబర్పేట కార్పొరేటర్ ఈ విజయ్ కుమార్ గౌడ్ గారు , ఈ సందర్భంగా సమావేశంలో మాట్లాడిన కార్పొరేటర్ అంబర్ పేట లో ముస్లింలకు కేటాయించిన గ్రేవీ యాడ్ నిర్మాణం కొరకు వెంటనే నిధులు మంజూరు చేయవలసిందిగా కోరడంతో, 1 కోటి 10 లక్షల రూపాయలు మంజూరు చేస్తూ సర్వసభ్య సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది, ఇందుకు గాను కార్పొరేటర్ గౌరవ అంబర్పేట్ ఎమ్మెల్యే శ్రీ కాలేరు వెంకటేష్ గారికి, గౌరవ మంత్రివర్యులు శ్రీ కేటీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నారు.

Vijay Kumar Goud Amberpet Division Corporator.

గౌరవ అంబర్ పేట నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ కాలేరు వెంకటేష్ గారు ఈరోజు జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యులు అంబర్ పేట కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్ గారితో కలిసి అంబర్ పేట డివిజన్ ప్రేమ్ నగర్ గ్రౌండ్ నీ 75 సంవత్సరాల స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా గ్రౌండ్ ని ఫ్రీడం పార్కుగా అభివృద్ధి చేయడం కోసం గ్రౌండ్లో మొక్కలు నాటి గ్రౌండ్ ని సుందరీకరించడం జరిగింది, ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి అధికారులు DC వేణుగోపాల్, AMOH జ్యోతిబాయ్, EE శంకర్, DE సుధాకర్,AMC హరి శంకర్,AE విఘ్నేశ్వరి, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ భాస్కర్, శ్రీధర్,SFA పాషా,ఉమేష్,భాస్కర్,శ్రీను మరియు టిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు సిద్ధార్థ ముదిరాజ్, పార్టీ సీనియర్ నాయకులు స్థానిక బస్తీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Vijay Kumar Goud Amberpet Division Corporator.

నరేంద్ర నగర్ లోనీ శివ ఆంజనేయం కమ్యూనిటీ హాల్ కి ఆనుకోనిఉన్న రిటర్నింగ్ వాల్ వర్షలా కారణంగా పడిపోవడంతో ఈరోజు ఉదయం సంఘటన స్థలాన్ని పరిశీలించిన జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యులు అంబర్పేట కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్ గారు వెంటనే స్పందించి సంబంధిత జిహెచ్ఎంసి సిబ్బందినీ పిలిపించి వారితో కలిసి సహాయక కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది,ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ స్థానిక ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వర్షాలు ఆగిపోగానే ప్రహరీ గోడ నిర్మాణం చేపడతామని తెలియజేశారు,అలాగే కమ్యూనిటీ హాల్ కిటికీలు, డోర్స్,మరియు పాడైపోయిన మిగిత వాటికి మెయింటెనెన్స్ ఇప్పిస్తానని స్థానికులకు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో స్థానిక బస్తీ ప్రజలు చంద్రయ్య,పడకండి బ్రహ్మచారి,శ్రీకాంత్,చంటి పంతులు శ్రీధర్ చారి, జిహెచ్ఎంసి సిబ్బంది,వర్క్ ఇన్స్పెక్టర్ దుర్గ,మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులు లతా,వేణు,సంతోష్ చారి తదితరులు పాల్గొన్నారు.

Vijay Kumaar Goud Amberpet Division Corporator.

గత నెల రోజులుగా వర్షాలు పడుతుండడంతో నరేంద్ర నగర్ లోనీ శివ ఆంజనేయం కమ్యూనిటీ హాల్ కి ఆనుకోనిఉన్న రిటర్నింగ్ వాల్ పడిపోవడంతో స్థానికులు జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యులు అంబర్పేట కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్ గారి దృష్టికి తేగా వెంటనే స్పందించిన కార్పొరేటర్ సంఘటన స్థలాన్ని స్థానికులతో కలిసి పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి వర్షాలు తగ్గగానే వెంటనే ప్రహరీ గోడని నిర్మించాలని తెలియజేశారు, ఈ కార్యక్రమంలో స్థానిక బస్తీ ప్రజలు చంద్రయ్య, పడకండి బ్రహ్మచారి, సాయి,శ్యామ్, పంతులు శ్రీధర్ చారి, యాదమ్మ, మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులు లతా, సంతోష్ చారి తదితరులు పాల్గొన్నారు.

Vijay Kumar Goud Amberpet Division Corporator.

అంబర్పేట డివిజన్ పటేల్ నగర్ లో వైద్య సిబ్బంది నిర్వహిస్తున్న వైద్య శిబిరాన్ని పరిశీలించిన జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యుడు అంబర్ పేట కార్పొరేటర్ ఇ.విజయకుమార్ గౌడ్ గారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో ప్రజలు జ్వరాల బారిన పడకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎవరికైనా జ్వరం వచ్చిన వైద్య సిబ్బంది నిర్వహిస్తున్న శిబిరంలో ఉచితంగా మందులు తీసుకోవాలని తెలియజేశారు, ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, నర్సులు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆమనూరి సతీష్,మహేష్ ముదిరాజ్, సంతోష్ చారి తదితరులు పాల్గొన్నారు.