Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్మీ ఉద్యోగాల నియామక ప్రక్రియ (అగ్నిపథ్) ను నిరసిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో చేపట్టిన ధర్నా కార్యక్రమంలో రైల్వే పోలీస్ కాల్పుల్లో వరంగల్ జిల్లాకు చెందిన రాకేష్ మరణం పట్ల సీఎం శ్రీ కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు.

కేంద్ర ప్రభుత్వ దుర్మార్గ విధానాలకు బలైపోయిన బిసి బిడ్డ రాకేష్ కుటుంబానికి సీఎం తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రైల్వే బలగాల కాల్పుల్లో మరణించిన రాకేష్ కుటుంబానికి 25 లక్షల పరిహారంతో పాటు, ఆ కుటుంబంలో అర్హులైన వారికి వారి ఆర్హత మేరకు ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇవ్వనున్నట్టు ప్రకటించారు.

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు విధానాల వల్లనే రాకేష్ బలయ్యిండని ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ బిడ్డలను రాష్ట్ర ప్రభుత్వం కడుపులో పెట్టుకొని కాపాడుకుంటుందని సీఎం స్పష్టం చేశారు.

#AgnipathScheme

0 Comments

There are no comments yet

Leave a comment

Your email address will not be published. Required fields are marked *