Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

Tag: amberpet

Foundation stone for the new CC road works.

అంబర్ పేట డివిజన్ బాపు నగర్ లో సుమారుగా 26 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా వేయనున్న సీసీ రోడ్డు పనులకు అంబర్ పేట నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ కాలేరు వెంకటేష్ గారు, అంబర్ పేట కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్ గారితో కలిసి శంకుస్థాపన చేశారు.

అనంతరం ఎమ్మెల్యే గారు కార్పొరేటర్ తో కలిసి బాపు నగర్ లో పాదయాత్ర నిర్వహించి స్థానికంగా ఉన్న సమస్యలను స్థానిక ప్రజలతో కలిసి పరిశీలించి స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను వెంటనే అధికారులతో చర్చించి, వీలైనంత త్వరగా సమస్యలని పరిష్కరించాలని తెలియజేశారు, అలాగే సిసి రోడ్డు పనులను స్థానిక ప్రజలకు ఏటు వంటి ఇబ్బంది కలగకుండా త్వరిత గతిన పూర్తి చేయ్యాలని, పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని తెలియజేశారు

అంబర్పేట్ కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్

75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అంబర్పేట్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ కాలేరు వెంకటేష్ అన్న గారితో కలిసి పాల్గొన్న అంబర్పేట్ కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్ గారు

75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అంబర్పేట్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ కాలేరు వెంకటేష్ అన్న గారితో కలిసి పాల్గొన్న అంబర్పేట్ కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్ గారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు పటేల్ నగర్ చౌరస్తాలో అలీ కేఫ్ లో మువ్వన్నెల జెండాని ఎగురవేయడం జరిగింది, అనంతరం కార్పొరేటర్ అంబర్ పేట డివిజన్ లోని బాపునగర్ న్యూ పటేల్ నగర్,పటేల్ నగర్, నరేంద్ర నగర్,ప్రేమ్ నగర్,న్యూ ప్రేమ్ నగర్,దుర్గ నగర్, మువ్వన్నెల జెండాను ఎగురవేసరు, కార్పొరేటర్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన స్వాతంత్ర సమరయోధులను స్మరించుకోవాలని, యువత వారి ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని, భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు సిద్ధార్థ ముదిరాజ్,ప్రధాన కార్యదర్శి జాఫర్, పార్టీ సీనియర్ నాయకులు,మహిళా నాయకులు మైనార్టీ నాయకులు పార్టీ అనుబంధ సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.