Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

Tag: telangana

వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించకుని శ్రీకాళహస్తిలో స్వామి అమ్మవార్లని దర్శించుకొని, ప్రత్యేక పూజల్లో పాల్గొన్న కోత లక్ష్మి రవి గౌడ్ – డిప్యూటీ మేయర్ బోడుప్పల్

75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా* బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 1వ డివిజన్ కార్పొరేటర్ *శ్రీ బోగి జంగయ్య యాదవ్* గారుపలు ప్రాంతాల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా* బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 1వ డివిజన్ కార్పొరేటర్ *శ్రీ బోగి జంగయ్య యాదవ్* గారు చెంగిచెర్ల క్రాంతి నగర్ కాలనీ రోడ్ నెం 2,3,4, ద్వారకా నగర్ ఫేజ్ 2, స్టాలిన్ నగర్ కాలనీ, ఓల్డ్ విలేజ్ హనుమాన్ నగర్, ఫ్రీ విలేజ్ కాలనీ, రాజేష్ నగర్ కాలనీ, సాయి దుర్గా నగర్, చిన్న క్రాంతి నగర్ కాలనీ, అరవింద నగర్ కాలనీ, మణికంఠ నగర్ కాలనీ, సాయిబాబా కాలనీతో పాటు పలు ప్రాంతాల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నాయకులు, కాలనీల అధ్యక్షులు, కార్యదర్శులు, మహిళలు, ప్రజలు పాల్గొన్నారు.

భారతీయ జనతా పార్టీ జిహెచ్ఎంసి కార్పొరేటర్లు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ శ్రీ కొప్పుల నర్సింహా రెడ్డి గారి ఆధ్వర్యంలో జిహెచ్ఎంసి కమిషనర్ శ్రీ రోనాల్డ్ రోజ్ గారిని కలిసిన బిజెపి కార్పొరేటర్లు.

భారతీయ జనతా పార్టీ జిహెచ్ఎంసి కార్పొరేటర్లు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ శ్రీ కొప్పుల నర్సింహా రెడ్డి గారి ఆధ్వర్యంలో జిహెచ్ఎంసి కమిషనర్ శ్రీ రోనాల్డ్ రోజ్ గారిని కలిసిన బిజెపి కార్పొరేటర్లు.

దాదాపు ఆరు నెలలుగా జిహెచ్ఎంసి కౌన్సిల్ సమావేశం జరగలేదని,త్వరలోనే ఎన్నికల కోడ్ రానుందని,అంత లోపల జనరల్ బాడీ సమావేశం నిర్వహించి ప్రజా సమస్యలపై చర్చించాలని, డివిజన్ వారీగా అభివృద్ధి నిధులను కేటాయించాలని, జోనల్ మీటింగ్ లు జరపాలను కోరడం జరిగినది.త్వరలోనే రానున్న వేసవికి సంబంధించిన సమస్యలు, నాలా డిసైలటింగ్ పనులు, శానిటేషన్ వ్యవస్థ , అక్రమ పార్కింగ్ చార్జీలు, విచ్చలవిడి ఆస్తి పన్ను వసూలు, లాంగ్ స్టాండింగ్ అధికారులు పై చెర్యలు తదితర సమస్యలతో ప్రజల నడ్డి విరుస్తున్నారని కమిషనర్ దృష్టికి తీసుకురావడం జరిగినది.సానుకూలంగా స్పందించిన కమిషనర్ జోనల్ లెవెల్ లో సమావేశాలు వెంటనే ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడం జరిగినది, సాధ్యమైనంత త్వరలో జనరల్ బాడీ కూడా ఏర్పాటు చేస్తామంటూ తెలియజేయడం జరిగినది.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్స్ శ్రవణ్, సురేఖ, వంగ మధుసూదన్ రెడ్డి,రవి చారీ,చేతన, రాజ్యలష్మి తదితరులు పాల్గొన్నారు.

రిపబ్లిక్ డే సందర్బంగా జెండా ఎగరవేసిన కార్పొరేటర్ కొత్తపల్లి మీనా ఉపేందర్ రెడ్డి.

కొత్తపల్లి మీనా ఉపేందర్ రెడ్డి, 136 డివిజన్ కార్పొరేటర్ నేరేడ్మెట్ డివిజన్ లోని నేరేడ్మెట్ చౌరస్తా, అంతయ్య కాలనీ, యాప్రాల్ లోని యాప్రాల్ బస్టాప్, భూపేష్ నగర్ లో రిపబ్లిక్ డే సందర్బంగా జెండా ఎగరవేసి అనంతరం యాప్రాల్ లోని అంబేద్కర్ విగ్రహం కి పూల మాల వేసిన కార్పొరేటర్.


ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్ గారు డివిజన్ లోని వివిధ కాలనీ లో రిపబ్లిక్ డే వేడుకల్లో BRS నాయకులతో కలిసి పాల్గొన్నారు.

ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు అల్వాల్ సర్కిల్ Ghmc ఆఫీస్ వెంకటాపురం డివిజన్ బోరాణి కమ్యూనిటీ, రాజీవ్ గాంధీ నగర్ లో రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్నారు,కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్ గారు డివిజన్ లోని వివిధ కాలనీ లో రిపబ్లిక్ డే వేడుకల్లో BRS నాయకులతో కలిసి పాల్గొన్నారు

మీర్పేట్ హెచ్ బి కాలనీ డివిజన్ పరిధిలోని ఓల్డ్ మీర్పేట్, ఎన్టీఆర్ నగర్, న్యూ నర్సింహానగర్ కాలనీలలో పర్యటించిన స్ధానిక కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్.

రానున్న వేసవి కాలం దృష్టిలో పెట్టుకొని మీర్పేట్ హెచ్ బి కాలనీ డివిజన్ పరిధిలోని ఓల్డ్ మీర్పేట్, ఎన్టీఆర్ నగర్, న్యూ నర్సింహానగర్ కాలనీలలో పర్యటించి మంచినీటి పైప్ లైన్ పనులకు చేపట్టిన చర్యలను పరిశీలించిన స్ధానిక కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్.

GHMC,5 జాతీయ అవార్డులు.

మేయర్ విజయలక్ష్మి: అధికారులు, కార్మికులు, ప్రజల సహకారంతో జీహెచ్‌ఎంసీకి జాతీయ అవార్డులు దక్కాయి గురువారం స్వచ్ఛ సర్వేక్షణ్-2023 కింద జీహెచ్‌ఎంసీ ఐదు అవార్డులతో సత్కరించింది.

అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ..కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

శేరిలింగంపల్లి డివిజన్ లోగల శ్రీరామ్ నగర్ కాలనీ, తారానగర్ విద్యానికేతన్ స్కూల్ ఆవరణలో మరియు హుడా ట్రేడ్ సెంటర్ లోని రామాలయంలో “బాల రాముడి విగ్రహం ప్రాణ ప్రతిష్ట” మహోత్సవం నేపథ్యంలో ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ గారు విచ్చేసి రామనామ స్మరణకు పాత్రులయ్యారు. అనంతరం ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు కార్పొరేటర్ గారిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా రామాలయంలో నిర్వహించిన శ్రీ రామ యజ్ఞంలో పాల్గొన్నారు. శ్రీరామ్ నగర్ కాలనీలో నూతనంగా చేపడుతున్న ‘కమాన్’ (ARCH) ను స్థానిక నాయకులతో, అసోసియేషన్ సభ్యులతో కలిసి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు.

పేద పిల్లలకు ఉచిత నోట్ పుస్తకాల పంపిణీ…

దీన్ దయాల్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పేద పిల్లలకు ఉచిత నోట్ పుస్తకాల పంపిణీ చేయడం జరిగింది. ఈ పుస్తకాలను వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు రామచందర్ సమకూర్చగా ముఖ్యఅతిథిగా మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రీ ఊరవల్లి శ్రవణ్ గారు పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మనకు దాతలు అందిస్తున్నటువంటి ఈ నోట్ పుస్తకాలను తీసుకొని మంచిగా చదువుకొని మనకున్నటువంటి పరిమిత వనరులను సద్వినియోగం చేసుకొని జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగాలని వారు ఈ సందర్భంగా కోరారు.