Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

Koppula Narsimha reddy Mansoorabad Division Corporator

పేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలో వసతులు లేక తీవ్ర ఇబ్బందులు — కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి..!
మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని జడ్జస్ కాలనీలో నిరుపేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ ప్రైమరీ పాఠశాల నందు కరెంట్ కట్ చేయడం స్ధానిక కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం పై మండిపడ్డారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…
✅ రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ స్కూల్స్ కీ దీటుగా విద్యార్థులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని కబుర్లు చెప్పడం తప్ప వసతులు మాత్రం శూన్యం అని మండిపడ్డారు.
✅ ప్రైవేట్ స్కూల్స్ లల్లో చదువుకునే స్తోమత లేక నిరుపేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుందామంటే సరైన వసతులు లేని దౌర్భాగ్య పరిస్థితని కరెంట్ కట్ చేయడం వలన బయటనే విద్యార్థులు ఉంటున్నారని నిజంగానే గులాబీ ప్రభుత్వానికి సిగ్గు చేటని ఎద్దేవా చేశారు.
✅ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలి కాని రాష్ట్రంలో ఉన్న పధకాలు ఎక్కడా లేవని దేశంలోనే నెం.1 పరిపాలన అని చెప్పుకునే రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రంలో ప్రభుత్వం పాఠశాలల పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయని హంగులు ఆర్భాటాలు, మాటలు తప్ప చేస్తున్నది ఏమీ లేదని అన్నారు.
✅ రాష్ట్ర ప్రభుత్వం బార్లు, వైన్స్ ల అభివృద్ధే కాకుండా వెంటనే విద్యాశాఖ మంత్రి చొరవ తీసుకొని ప్రభుత్వ పాఠశాలలలో వసతులు కల్పించి నేటి బాలలే రేపటి పౌరుల భవిష్యత్తుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
✅ పాఠశాలలో కావలసిన సౌకర్యాలను అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకుని సిబ్బంది హాజరు పై రిజిస్టర్ ను తనిఖీ చేసి ఇక్కడ ఎదుర్కొంటున్న సమస్యలను పై అధికారుల దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది HM రూప్ సింగ్, సరళ, విమల, కిష్టయ్య, బాలమణి, ప్రతమ్ జవాన్ శ్రీనివాస్ రావు మరియు బిజెపి నాయకులు నాంపల్లి రామేశ్వర్, ముత్యం రెడ్డి, యంజాల జగన్, పాతూరి శ్రీధర్ గౌడ్, హరీష్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
తేదీ: 28/07/2022

0 Comments

There are no comments yet

Leave a comment

Your email address will not be published. Required fields are marked *