Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

Tag: telangana

జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆ మహానీయుడికి ఘన నివాళి!

జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆ మహానీయుడికి ఘన నివాళి! ఈ అమరవీరుల దినం నాడు స్వాతంత్ర‌ పోరాట యోధులను మనమందరం స్మరించుకోవాలి.కార్పొరేటర్ హేమ సామల

శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి ఆలయ నూతన ఛైర్మన్‌గా ఎన్నికైన లక్ష్మారెడ్డి గారికి శ్రీమతి బొంతు శ్రీదేవి యాదవ్ గారు శుభాకాంక్షలు తెలియజేసారు

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి ఆలయ నూతన ఛైర్మన్‌గా ఇటీవల ఎన్నికైన లక్ష్మారెడ్డి గారు.ఈ సందర్భంగా చర్లపల్లి కార్పొరేటర్ ఆల్ యాదవ మహిళా ఫ్రంట్ చైర్ పర్సన్ శ్రీమతి బొంతు శ్రీదేవి యాదవ్ గారు తన నివాసంలో శుభాకాంక్షలు తెలియజేసారు. మల్లన్న ఆలయంలో భక్తులకు సకల సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు, యాదవ సంఘం నాయకులు పాల్గొన్నారు.

అల్లాపూర్ డివిజన్ పరిధిలోని పద్మావతి నగర్ లో భూగర్భ డ్రైనేజీ రోడ్లపై పొంగిపొర్లి స్థానికుల రాకపోకలకు ఇబ్బందికరంగా మారడంతో యుద్ధ ప్రాతిపదికన స్పందించిన కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్

కూకట్పల్లి నియోజకవర్గ అల్లాపూర్ డివిజన్ పరిధిలోని పద్మావతి నగర్ లో భూగర్భ డ్రైనేజీ రోడ్లపై పొంగిపొర్లి స్థానికుల రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది అని స్థానికుల ఫిర్యాదు మేరకు ఈరోజు కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ గారు ఎయిర్ టేక్ మిషన్ సహాయంతో సివరేజ్ సిబ్బందితో మ్యాన్ హోల్ టు మ్యాన్ హోల్ ఎయిర్ టేక్ మిషన్ సహాయంతో ప్రెషర్ పెట్టి లోపల ఉన్న షిల్టును తొలగించాలని చుట్టు పక్కల ఉన్న మిగతా మ్యాన్ హోల్స్ కూడా క్లీన్ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కోఆర్డినేటర్ వీరారెడ్డి, జావిదుద్దీన్, సంజీవరెడ్డి, రవీందర్ రెడ్డి, జుభేర్, యోగి రాజు, హరీష్, తదితరులు పాల్గొన్నారు.

అంబర్ పేట డివిజన్ దుర్గ నగర్ లో సుమారుగా 60 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా వేయనున్న సీసీ రోడ్డు పనులు,మరియు డ్రైనేజ్ పనులకు అంబర్ పేట నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ కాలేరు వెంకటేష్ గారు, అంబర్ పేట కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్ గారితో కలిసి శంకుస్థాపన చేశారు.

నూతన సీసీ రోడ్డు,మరియు సివరేజి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గారు, అంబర్ పేట డివిజన్ దుర్గ నగర్ లో సుమారుగా 60 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా వేయనున్న సీసీ రోడ్డు పనులు,మరియు డ్రైనేజ్ పనులకు అంబర్ పేట నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ కాలేరు వెంకటేష్ గారు, అంబర్ పేట కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్ గారితో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే గారు దుర్గ నగర్ లో పాదయాత్ర నిర్వహించి స్థానికంగా ఏమన్నా సమస్యలు ఉంటే తమ దృష్టికి తేవాలని ఎటువంటి సమస్యలు ఉన్న పరిశీలించి పరిష్కరిస్తామని తెలియజేశారు, అలాగే డ్రైనేజ్ మరియు సిసి రోడ్డు పనులను స్థానిక ప్రజలకు ఏటు వంటి ఇబ్బంది కలగకుండా త్వరిత గతిన పూర్తి చేయ్యాలని, పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత సిబ్బంది వర్క్ ఇన్స్పెక్టర్ దుర్గ,రమేష్,SFA భాస్కర్, ప్రణయ్,బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జాఫర్, సీనియర్ నాయకులు,కార్యకర్తలు, మహిళా నాయకులు,స్థానిక బస్తీ ప్రజలు,తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ & లైబ్రరీ కోసం సర్వే చేయాలని ముషీరాబాద్ తహశీల్దార్ వెంకటలక్ష్మి గారిని అభ్యర్థించిన సీతాఫల్‌మండి డివిజన్‌ కార్పొరేటర్ హేమ సామల

గౌరవ ఎమ్మెల్యే పద్మారావు గారి సూచనల మేరకు ముషీరాబాద్ తహశీల్దార్ వెంకటలక్ష్మి గారు ప్రతిపాదిత మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ & లైబ్రరీ కోసం సీతాఫల్‌మండి డివిజన్‌లోని ప్రభుత్వ భూములను సర్వే చేయాలని, పెండింగ్‌లో ఉన్న కల్యాణలక్ష్మి చెక్కుల ప్రాసెస్‌పై చర్చించాలని కోరిన సీతాఫల్‌మండి డివిజన్‌ కార్పొరేటర్ హేమ సామల

HMWSSB సీజీఎం నాగేందర్ గారితో సమావేశమైన మీర్పెట్ హెచ్ బీ కాలనీ డివిజన్ కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్.

మీర్పెట్ హెచ్ బీ కాలనీ డివిజన్ పరిధిలోనీ పలు కాలనీలకు సంబంధించిన భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ పునరుద్దరణకు పైప్ లైన్ల పనులకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించాలని కోరుతూ HMWSSB సీజీఎం నాగేందర్ గారితో సమావేశమైన కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్.

మధురపురి కాలనీ లో తరచుగా డ్రైనేజీ పొంగి పోవడంతో కాలనీ వాసులకు, వ్యాపారులకు, వాహనదారులకు చాలా ఇబ్బందిగా మారిందని ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని ఉన్నత అధికారులకు ఆదేశించిన గడ్డిఅన్నారం కార్పొరేటర్ శ్రీ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి గారు

బుర్రా మహేందర్‌గౌడ్‌ ఆధ్వర్యంలో బండ్లగూడ జాగీర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేయర్‌ స్పందించారు.

గత 3 రోజులుగా 22వ వార్డు ఆదర్శనగర్ కమ్యూనిటీ హాల్‌కు సంబంధించి శిలాఫలకంపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై మేయర్‌ బుర్రా మహేందర్‌గౌడ్‌ ఆధ్వర్యంలో బండ్లగూడ జాగీర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేయర్‌ స్పందించారు. కమ్యూనిటీ హాల్ మరియు మరో 6 కమ్యూనిటీ హాళ్లు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అన్ని పనులను పంచాయతీ రాజ్ శాఖ స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్ గారు ప్రొసీడింగ్ ఇచ్చారు, కమ్యూనిటీ హాల్ మొత్తం ఖర్చు రూ. ||40.00 లక్షలు అయితే పంచాయితీ రాజ్ శాఖకు మున్సిపల్ శాఖ నుండి పంచాయితీ శాఖ వరకు కేవలం 50% నిధులు మాత్రమే ఇచ్చారని, అవినీతికి తావులేకుండా పనులు చేపట్టారని, ఇలా అసత్య ప్రచారం చేయడం సరికాదన్నారు. అతను సాక్ష్యాధారాలతో నిరూపించబడ్డాడు, పక్షంలో రుజువు చేయకపోతే నేను ఎలాంటి చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను తమ పదవులకు రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. అధికారులతో పాటు క్లారిటీ ఇవ్వడం సరికాదని, పనులకు సంబంధించిన ఫైలును విలేకరులకు అందజేశారు. ఈ విలేకరుల సమావేశంలో మున్సిపల్ కమిషనర్ బి. శరత్‌చంద్ర, మున్సిపల్‌ ఇంజినీరింగ్‌ ఎస్‌ఈ శివానంద్‌, డీఈ యాదయ్య, ఏఈఈ రాజకుమార్‌, కార్పొరేటర్లు-సాగర్‌గౌడ్‌, కోఆప్షన్‌ సభ్యులు వెంకట్‌రెడ్డి, సీనియర్‌ నాయకులు గోకారి సురేష్‌గౌడ్‌, పాపయ్య యాదవ్‌, పాండు, వెంకటేశ్‌, తదితరులు పాల్గొన్నారు.

బోడుప్పల్ నగర పాలక సంస్థ యందు ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన అభయహస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన మేయర్ సామల బుచ్చిరెడ్డి గారు కమీషనర్ వేణుగోపాల్ రెడ్డి తో కలిసి వివిధ డివిజన్లలో పర్యటించి ధరఖాస్తు దారులు చెప్పే సమస్యలు దగ్గరుండి పరిశీలించి వివరాలు తెలిపారు.