Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

Day: January 25, 2024

75వ “గణతంత్ర దినోత్సవ సందర్భమును పురస్కరించుకొని తేదీ. 26.01.2024 శుక్రవారం ఉదయం 09:00 గంటలకు శేరిలింగంపల్లి కార్పొరేటర్ గారి కార్యాలయ ఆవరణలోపతాక ఆవిష్కరణ.

ఇందుమూలముగా పురప్రముఖులకు పట్టణ ప్రజలకు, డివిజన్ అధ్యక్షులకు, సీనియర్ నాయకులకు, బస్తీ కమిటీ అధ్యక్షులకు, బూత్ కమిటీ ఇంచార్జి లకు, మెంబర్లకు, కాలనీ అసోసియేషన్ అనుబంధ సంఘ ప్రతినిధులకు, యువ నాయకులకు, మహిళా నాయకురాళ్లకు, శ్రేయోభిలాషులకు తెలియజేయునది ఏమనగా 75వ “గణతంత్ర దినోత్సవ”సందర్భమును పురస్కరించుకొని తేదీ. 26.01.2024 శుక్రవారం ఉదయం 09:00 గంటలకు శేరిలింగంపల్లి కార్పొరేటర్ గారి కార్యాలయ ఆవరణలో శేరిలింగంపల్లి కార్పొరేటర్ గౌరవ శ్రీ రాగం నాగేందర్ యాదవ్ గారిచే జాతీయ పతాక ఆవిష్కరణ జరుపబడును. కావున ఇట్టి కార్యక్రమమునకు సకాలములో విచ్చేసి జయప్రదము చేయగలరని కోరనైనది.రాగం నాగేందర్ యాదవ్

అంబర్ పేట డివిజన్ బాపు నగర్ లో సుమారుగా 7.5 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా వేయనున్న సీసీ రోడ్డు పనులను అంబర్ పేట నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ కాలేరు వెంకటేష్ గారు, అంబర్ పేట కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్ గారితో కలిసి శంకుస్థాపన చేశారు

అంబర్ పేట డివిజన్ బాపు నగర్ లో సుమారుగా 7.5 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా వేయనున్న సీసీ రోడ్డు పనులను అంబర్ పేట నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ కాలేరు వెంకటేష్ గారు, అంబర్ పేట కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్ గారితో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే గారు బాపు నగర్ లో ఉన్నటువంటి స్థానిక సమస్యలను పరిశీలించి స్థానికంగా ఉన్న డ్రైనేజీ సమస్యను సంబంధిత అధికారులకు చూపించి ఇప్పటి జనాభాకు అనుగుణంగా అవసరమైన చోట నూతన డ్రైనేజ్ పైప్ లైన్ లు ఏర్పాటు చేస్తున్నామని, అవసరమైన చోట 11 కెవి విద్యుత్ వైర్లను ఏర్పాటు చేయాలని,స్థానిక ప్రజలకు ఏటు వంటి ఇబ్బంది కలగకుండా సీసీ రోడ్డు పనులను త్వరిత గతిన పూర్తి చేయ్యాలని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు AE మజీద్, విద్యుత్ AE శ్రీనివాస్,వర్క్ ఇన్స్పెక్టర్ దుర్గ,రమేష్,SFA పాషా,బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు సిద్ధార్థ ముదిరాజ్, పార్టీ సీనియర్ నాయకులు,కార్యకర్తలు, మహిళా నాయకులు,స్థానిక బస్తీ ప్రజలు,తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

హేమ సామల, ఠాగూర్ ఆడిటోరియంలో జరిగిన ఉస్మానియా యూనివర్సిటీ బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగం స్వర్ణోత్సవ వేడుకలకు హాజరయ్యారు.

  • హేమ సామల ఠాగూర్ ఆడిటోరియంలో జరిగిన ఉస్మానియా యూనివర్సిటీ బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగం స్వర్ణోత్సవ వేడుకలకు హాజరయ్యారు. DBM హెడ్, ఫ్యాకల్టీ, రీసెర్చ్ స్కాలర్లు, పూర్వ విద్యార్థులు & ప్రస్తుత విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

శాంతి శ్రీనివాస్ రెడ్డి, GHMC & HMWSSB అధికారులతో కలిసి అల్వాల్ నాగి రెడ్డి కాలనీని సందర్శించారు.

శాంతి శ్రీనివాస్ రెడ్డి GHMC & HMWSSB అధికారులతో కలిసి అల్వాల్ నాగి రెడ్డి కాలనీని సందర్శించారు, మరియు వర్షాల సమయంలో నీరు నిలిచిపోవడం మరియు కొత్త ప్రతిపాదిత మురుగునీటి లైన్ గురించి నివాసితులతో సంభాషించారు. సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

మీర్పేట్ హెచ్ బి కాలనీ డివిజన్ పరిధిలోని ఓల్డ్ మీర్పేట్, ఎన్టీఆర్ నగర్, న్యూ నర్సింహానగర్ కాలనీలలో పర్యటించిన స్ధానిక కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్.

రానున్న వేసవి కాలం దృష్టిలో పెట్టుకొని మీర్పేట్ హెచ్ బి కాలనీ డివిజన్ పరిధిలోని ఓల్డ్ మీర్పేట్, ఎన్టీఆర్ నగర్, న్యూ నర్సింహానగర్ కాలనీలలో పర్యటించి మంచినీటి పైప్ లైన్ పనులకు చేపట్టిన చర్యలను పరిశీలించిన స్ధానిక కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్.

GHMC,5 జాతీయ అవార్డులు.

మేయర్ విజయలక్ష్మి: అధికారులు, కార్మికులు, ప్రజల సహకారంతో జీహెచ్‌ఎంసీకి జాతీయ అవార్డులు దక్కాయి గురువారం స్వచ్ఛ సర్వేక్షణ్-2023 కింద జీహెచ్‌ఎంసీ ఐదు అవార్డులతో సత్కరించింది.