Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

Day: January 27, 2024

వడ్డెర బస్తీలో జరుగుతున్న యూజీడీ పైపుల ఏర్పాటు పనులను పరిశీలించిన కార్పొరేటర్ కొంతమ్ దీపిక.

వడ్డెర బస్తీలో జరుగుతున్న యూజీడీ పైపుల ఏర్పాటు పనులను హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ మేనేజర్‌ శ్రవంతి, ఫీల్డ్‌ ఇన్‌స్పెక్టర్లు శంకర్‌, ఖాజా, బృందంతో కలిసి కార్పొరేటర్ కొంతమ్ దీపిక పరిశీలించారు. అలాగే నివాసితులతో వారి సమస్యలపై చర్చించారు.

భారతీయ జనతా పార్టీ జిహెచ్ఎంసి కార్పొరేటర్లు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ శ్రీ కొప్పుల నర్సింహా రెడ్డి గారి ఆధ్వర్యంలో జిహెచ్ఎంసి కమిషనర్ శ్రీ రోనాల్డ్ రోజ్ గారిని కలిసిన బిజెపి కార్పొరేటర్లు.

భారతీయ జనతా పార్టీ జిహెచ్ఎంసి కార్పొరేటర్లు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ శ్రీ కొప్పుల నర్సింహా రెడ్డి గారి ఆధ్వర్యంలో జిహెచ్ఎంసి కమిషనర్ శ్రీ రోనాల్డ్ రోజ్ గారిని కలిసిన బిజెపి కార్పొరేటర్లు.

దాదాపు ఆరు నెలలుగా జిహెచ్ఎంసి కౌన్సిల్ సమావేశం జరగలేదని,త్వరలోనే ఎన్నికల కోడ్ రానుందని,అంత లోపల జనరల్ బాడీ సమావేశం నిర్వహించి ప్రజా సమస్యలపై చర్చించాలని, డివిజన్ వారీగా అభివృద్ధి నిధులను కేటాయించాలని, జోనల్ మీటింగ్ లు జరపాలను కోరడం జరిగినది.త్వరలోనే రానున్న వేసవికి సంబంధించిన సమస్యలు, నాలా డిసైలటింగ్ పనులు, శానిటేషన్ వ్యవస్థ , అక్రమ పార్కింగ్ చార్జీలు, విచ్చలవిడి ఆస్తి పన్ను వసూలు, లాంగ్ స్టాండింగ్ అధికారులు పై చెర్యలు తదితర సమస్యలతో ప్రజల నడ్డి విరుస్తున్నారని కమిషనర్ దృష్టికి తీసుకురావడం జరిగినది.సానుకూలంగా స్పందించిన కమిషనర్ జోనల్ లెవెల్ లో సమావేశాలు వెంటనే ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడం జరిగినది, సాధ్యమైనంత త్వరలో జనరల్ బాడీ కూడా ఏర్పాటు చేస్తామంటూ తెలియజేయడం జరిగినది.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్స్ శ్రవణ్, సురేఖ, వంగ మధుసూదన్ రెడ్డి,రవి చారీ,చేతన, రాజ్యలష్మి తదితరులు పాల్గొన్నారు.

రిపబ్లిక్ డే సందర్బంగా జెండా ఎగరవేసిన కార్పొరేటర్ కొత్తపల్లి మీనా ఉపేందర్ రెడ్డి.

కొత్తపల్లి మీనా ఉపేందర్ రెడ్డి, 136 డివిజన్ కార్పొరేటర్ నేరేడ్మెట్ డివిజన్ లోని నేరేడ్మెట్ చౌరస్తా, అంతయ్య కాలనీ, యాప్రాల్ లోని యాప్రాల్ బస్టాప్, భూపేష్ నగర్ లో రిపబ్లిక్ డే సందర్బంగా జెండా ఎగరవేసి అనంతరం యాప్రాల్ లోని అంబేద్కర్ విగ్రహం కి పూల మాల వేసిన కార్పొరేటర్.


ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్ గారు డివిజన్ లోని వివిధ కాలనీ లో రిపబ్లిక్ డే వేడుకల్లో BRS నాయకులతో కలిసి పాల్గొన్నారు.

ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు అల్వాల్ సర్కిల్ Ghmc ఆఫీస్ వెంకటాపురం డివిజన్ బోరాణి కమ్యూనిటీ, రాజీవ్ గాంధీ నగర్ లో రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్నారు,కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్ గారు డివిజన్ లోని వివిధ కాలనీ లో రిపబ్లిక్ డే వేడుకల్లో BRS నాయకులతో కలిసి పాల్గొన్నారు

ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు.జాతీయ జెండాను శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గౌరవ శ్రీ అరేకపూడి గాంధీ గారితో కలిసి ఎగురవేసిన శేరిలింగంపల్లి కార్పొరేటర్ గౌరవ శ్రీ రాగం నాగేందర్ యాదవ్ గారు

ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు.జాతీయ జెండాను శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గౌరవ శ్రీ అరేకపూడి గాంధీ గారితో కలిసి ఎగురవేసిన శేరిలింగంపల్లి కార్పొరేటర్ గౌరవ శ్రీ రాగం నాగేందర్ యాదవ్ గారు

శేరిలింగంపల్లి డివిజన్ లోగల GHMC జోనల్ కార్యలయంలో గణతంత్ర దినోత్సవం ను పురస్కరించుకొని ఏర్పాటుచేసిన జాతీయ జెండాను జోనల్ కమిషనర్ స్నేహ శబరీస్ గారితో మరియు తదితర డివిజన్ గౌరవ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, జిహెచ్ఎంసి సంబంధిత అధికారులు, పుర ప్రముఖులతో కలిసి ఆవిష్కరించి గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం కార్పొరేటర్ గారి వార్డ్ కార్యాలయ ఆవరణలో జాతీయ జెండాను ఎగురవేసి మహాత్మా గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు.

అనంతరం డివిజన్ అధ్యక్షులు రాజు యాదవ్, మాజీ కౌన్సిలర్ సోమదాస్, మోహన్ గౌడ్, సీనియర్ నాయకులు హబీబ్ భాయ్, కొండల్ రెడ్డి, శ్రీనివాస్ రాజ్ ముదిరాజ్ వార్డ్ మెంబర్ శ్రీకళ, రాంబాబు, గోపాల్ యాదవ్, రవి యాదవ్, కొయ్యాడలక్ష్మణ్ యాదవ్, సుభాష్, సీనియర్ నాయకులతో కలిసి సుదర్శన్ నగర్ కాలనీ, గోపి నగర్, ఆదర్శ్ నగర్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, హుడా ట్రేడ్ సెంటర్, శేరిలింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం, లింగంపల్లి విలేజ్ రావ్వ్స్ జిమ్, జయశంకర్ చౌరస్తా, ఎంపీపీఎస్ సురభి కాలనీ, ఆర్ జి కే సెంటర్, ఆరంభ టౌన్షిప్, బాపునగర్ హనుమాన్ యూత్, మసీద్ బండ సర్కిల్, ఇందిరా నగర్, గచ్చిబౌలి స్ట్రీట్ నెంబర్ 3, చిన్న అంజయ్య నగర్ మరియు పలు కాలనీలలో జాతీయ పతాకాన్ని ఎగురవేసి గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు.

కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ గారు మాట్లాడుతూ..రాష్ట్ర ప్రజలకు 75 వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకుని వారి ఆదర్శాలకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.

నూతనంగా 55 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న స్ర్టాం వాటర్ డ్రైన్..!

నూతనంగా 55 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న స్ర్టాం వాటర్ డ్రైన్..!

సబీహా గౌసుద్దీన్

కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని అజీజ్ నగర్ లో ఈరోజు కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ గారు నూతనంగా 55 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న స్ర్టాం వాటర్ డ్రైన్ మరియు సిసి రోడ్డు పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ అజీజ్ నగర్, మెరాజ్ నగర్, పద్మావతి నగర్, సైడ్ త్రీ మీదుగా ప్రవహించే వర్షపు నీరు వల్ల చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజలకు వర్షాకాలంలో ఇబ్బందికరంగా ఉండేది కనుక గౌరవ ఎమ్మెల్యే శ్రీ మాధవరం కృష్ణారావు గారి సహకారంతో 55 లక్షల వ్యయంతో స్ర్టాం వాటర్ డ్రైన్ మరియు సిసి రోడ్డు పనులను పూర్తి చేసుకోగలుగుతున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మహ్మద్ మోయిజ్, మహమ్మద్ చున్ను, జావీద్, మథిన్, తదితరులు పాల్గొన్నారు.

అంబర్పేట్ కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్

75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అంబర్పేట్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ కాలేరు వెంకటేష్ అన్న గారితో కలిసి పాల్గొన్న అంబర్పేట్ కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్ గారు

75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అంబర్పేట్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ కాలేరు వెంకటేష్ అన్న గారితో కలిసి పాల్గొన్న అంబర్పేట్ కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్ గారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు పటేల్ నగర్ చౌరస్తాలో అలీ కేఫ్ లో మువ్వన్నెల జెండాని ఎగురవేయడం జరిగింది, అనంతరం కార్పొరేటర్ అంబర్ పేట డివిజన్ లోని బాపునగర్ న్యూ పటేల్ నగర్,పటేల్ నగర్, నరేంద్ర నగర్,ప్రేమ్ నగర్,న్యూ ప్రేమ్ నగర్,దుర్గ నగర్, మువ్వన్నెల జెండాను ఎగురవేసరు, కార్పొరేటర్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన స్వాతంత్ర సమరయోధులను స్మరించుకోవాలని, యువత వారి ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని, భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు సిద్ధార్థ ముదిరాజ్,ప్రధాన కార్యదర్శి జాఫర్, పార్టీ సీనియర్ నాయకులు,మహిళా నాయకులు మైనార్టీ నాయకులు పార్టీ అనుబంధ సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

కార్పొరేటర్ శ్రీ నార్నె శ్రీనివాస రావు

స్ట్రామ్ వాటర్ డ్రైన్ (వరద నీటి కాలువ) నిర్మాణ పనులను జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులతో, కాలనీ వాసులతో కలిసి పరిశీలించిన గౌరవ కార్పొరేటర్ శ్రీ నార్నె శ్రీనివాస రావు గారు.

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని జానకి రామ టవర్స్ వద్ద చేపడుతున్నటువంటి స్ట్రామ్ వాటర్ డ్రైన్ (వరద నీటి కాలువ) నిర్మాణ పనులను జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులతో, కాలనీ వాసులతో కలిసి పరిశీలించిన గౌరవ కార్పొరేటర్ శ్రీ నార్నె శ్రీనివాస రావు గారు.