Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

Day: July 7, 2022

Dodla Venkatesh Rao Allwyn Colony Corporator

124 డివిజన్ పరిధిలోని ఇంద్రాహిల్స్ మరియు సాయి చరణ్ కాలనీ మధ్యలో నూతనంగా నిర్మించిన కాల్వర్ట్ వంతెన వద్ద రోడ్డుపై వర్షపునీరు నిల్వ ఉంటుందని కాలనీ ప్రజలు స్థానిక కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారి దృష్టికి తీసుకునిరాగా కార్పొరేటర్ గారు సమస్యను స్వయంగా పరిశీలించడం జరిగింది. వర్షపు నీరు నిల్వ ఉండకుండా తగిన చర్యలు వెంటనే తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. అలాగే కాల్వర్ట్ వంతెన నిర్మాణ పనులను కూడా పరిశీలించిన కార్పొరేటర్ గారు

5.7.2022 at 12.39

Narne Srinivasa Rao

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్ కాలనీ లో షుమారు రూ.30 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను పరిశీలించిన గౌరవ కార్పొరేటర్ శ్రీ నార్నె శ్రీనివాస్ గారు. ఈ సందర్భంగా నార్నె శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ, హైదర్ నగర్ డివిజన్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని, డివిజన్ ను ఆదర్శవంతమైన డివిజన్ గా తీర్చిదిద్దడానికి నా వంతు శాయ శక్తుల కృషి చేస్తానని కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు గారు పేర్కొన్నారు. అదే విదంగా సి సి రోడ్డు పనులలో జాప్యం లేకుండా, త్వరితగతిన సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని, పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని, జిహెచ్ఎంసి అధికారులకు, కాంట్రాక్టర్కు తగు సూచనలు చేసిన నార్నె శ్రీనివాసరావు గారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి వర్క్ ఇన్స్పెక్టర్ మహదేవ్, కాంట్రాక్టర్ బాబురావు, హైదర్ నగర్ డివిజన్ ఉపాధ్యక్షులు పోతుల రాజేందర్, కాలనీ వాసులు గోపి, రాంబాబు, శ్రీనివాస్ రెడ్డి, గోపాల్ రెడ్డి, రాజేష్, వెంకట్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

5.7.2022 at 3.42

Madhavaram Roja gari

వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని పటేల్ కుంట పార్క్ పక్కన శుభోదయ కాలనీ లో రూ.24 ఇరవై నాలుగు లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే UGD నిర్మాణ పనులకు గౌరవ గౌరవ ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ గారి తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేసిన గౌరవ కార్పొరేటర్ శ్రీమతి రోజాదేవి రంగరావు గారు.

6.7.2022 at 1.30

Madhavaram Roja Viveknanda Nagar Corporator

హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (GHMC) మరియు ఆలింకో సంస్థ సమన్వయంతో హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని HMT హిల్స్ కమ్యూనిటీ హాల్ లో నిర్వహించిన BPL పరిధిలో ఉన్న విభిన్న ప్రతిభావంతులకు(దివ్యాంగులకు) మరియు వయో వృద్ధులకు ఉచిత ఉపకరణాలను,కృత్రిమ అవయవాలను మరియు సహాయ పరికరాల ఎంపిక గుర్తింపు శిబిరంను గౌరవ కార్పొరేటర్లు శ్రీమతి మాధవరం రోజాదేవి రంగరావు గారు,శ్రీ నార్నె శ్రీనివాసరావు గారు, శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ గార్ల తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన గౌరవ ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ గారు

7.7.2022 at 2.14