Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

Day: June 14, 2022

గడ్డిఅన్నారం డివిజన్ శ్రీనగర్ కాలనీ లోని అన్నపూర్ణ కాంప్లెక్స్ నిర్వాహకులు రోడ్డును ఆక్రమించి వారి కాంప్లెక్స్ యొక్క పార్కింగ్ ర్యాంప్, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మరియు స్తంభం వేయడం వల్ల కాలనీకి మంచినీటి సరఫరా అయ్యే పైప్లైన్ దెబ్బతినడంతో కాలనీవాసులు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో, కాలనీ సంక్షేమ సంఘం వారు విషయాన్ని డివిజన్ కార్పొరేటర్ బద్ధం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి గారి దృష్టికి తీసుకువచ్చారు. కార్పొరేటర్ గారు జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ కృష్ణయ్య మరియు విద్యుత్ శాఖ అధికారులను పిలిపించి వారికి సమస్యను వివరించి వెంటనే చర్య తీసుకొని రాంపులు తొలగించి, మంచి నీటి పైప్ లైన్ పునరుద్ధరించి కాలనీవాసులకు ఇబ్బంది కలగకుండా చూడాలని కోరారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ ప్రేమ్ గారు మాట్లాడుతూ డివిజన్ లో ఎవరైనా భవనాలను నిర్మించేటప్పుడు రోడ్లను ఆక్రమించినా, వ్యక్తిగత అవసరాల కోసం రోడ్లను తవ్వి నా, వ్యాపారస్తులు చెత్తను స్వచ్ఛ్ఆటో వారికి ఇవ్వకుండా రోడ్లపై పడవేసినా కఠిన చర్యలు తప్పవు అని అన్నారు.

లెదర్‌ ఉత్పత్తులు తెలంగాణలో తయారయ్యేలా చర్యలు ప్రారంబించిన టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇందులో భాగంగా నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో లెదర్‌ క్లస్టర్‌ను, అలాగే ఆరు జిల్లాల్లో మినీ లెదర్‌ పార్కులను అందుబాటులోకి తెస్తున్నది.

సికింద్రాబాద్ నియోజకవర్గం తార్నాక డివిజన్ లోని లాలాపేటలో చేపట్టినా రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా స్థలాలు కోల్పోయిన నలుగురికి రూ.80.62 లక్షల విలువ గల చెక్కులను గౌరవ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గారితో కలిసి అందచేయడం జరిగింది.